శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 12:55:39

కాలువలో దూకిన మహిళ..ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు

కాలువలో దూకిన మహిళ..ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు

కరీంనగర్ : పోలీసులు, స్థానికుల చాకచక్యంతో ఒక మహిళ నిండు ప్రాణం దక్కింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తిమ్మాపూర్ మండలం అల్గునూరు శివారులోని కాకతీయ కాలువలో.. కరీంనగర్ పట్టణానికి  చెందిన మహిళ కాకతీయ కెనాల్ లో దూకింది. నీటి ప్రవాహానికి కొట్టుకొని పోతున్న ఆ మహిళను.. అటుగా వెళ్తున్న స్థానికులు సుందరగిరి సతీష్, దుండ్ర ఎల్లయ్య నీటి నుంచి బయటకు తీశారు. 

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎల్ఎండీ ఎస్ఐ కృష్ణారెడ్డి, బ్లుకోట్స్ హోంగార్డ్ లక్ష్మీనారాయణ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను పోలీస్ వాహనంలో స్వయంగా ఎస్ఐ కృష్ణారెడ్డి వాహనం నడుపుకుంటూ వెళ్లి కరీంనగర్ లో దవాఖానలో చేర్పించారు.

ఎలాగైనా మహిళ ప్రాణాలు కాపాడాలనే ఆలోచనతో సొంతంగా వాహనాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఎస్ఐని ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు. అలాగే మహిళను కాపాడిన సతీష్, ఎల్లయ్యను ఎస్ఐ కృష్ణారెడ్డి, ప్రజలు అభినందించారు.


logo