ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 19:00:54

మేనల్లుడిని దారుణంగా హత్య చేసి కప్‌బోర్డులో పెట్టిన... మహిళ

మేనల్లుడిని దారుణంగా హత్య చేసి కప్‌బోర్డులో పెట్టిన... మహిళ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణ జరిగింది. ఓ మహిళ.. తన మేనల్లుడిని దారుణంగా హత్య చేసి, కప్‌బోర్డులో ఉంచింది. బాలుడి తల్లితో గొడవ పడిన తర్వాత ఈ హత్యకు తెగబడింది నిందితురాలు. బాలుడి తల్లి శంపా బీబీకి, ఆమె దగ్గరి బంధువైన తజ్మీరా బీబీ అనే మహిళతో తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం నుంచి శంపా బీబీ రెండేండ్ల కుమారుడు కనిపించకుండా పోయాడు.

ఈ నేపథ్యంలో శంపా బీబీ, ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తజ్మీరా బీబీ ఇంట్లో సోదాలు చేయగా ఓ కప్‌బోర్డులో బాలుడి మృతదేహం లభించింది. కాగా, ఇంట్లోకి వచ్చిన మేనల్లుడిని తజ్మీరా గట్టిగా చెంప మీద కొట్టడంతో అతడు కిందపడి అపస్మారక స్థితిలోకి పోయాడు. తన కుమారుడితో గొడవ పెట్టుకున్నాడనే కోపంతోనే అతన్ని కొట్టి చంపింది. ఆ తర్వాత అతన్ని కప్‌బోర్డులో పెట్టింది.logo