శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 15:31:19

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

హైదరాబాద్ : భార్య, భర్తను హత్య చేసిన విషాద సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్మీలో పదవీ విరమణ పొందిన విశాల్ దివాన్ ను కుటుంబ కలహాలతో భార్య సబీనా రోషం శనివారం రాత్రి కత్తితో పొడిచి చంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సన్ సిటీ మాఫెల్ టౌన్ షిప్ లో విశాల్ దివాన్, సబీనా రోషం నివాసముంటున్నారు.

అయితే గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో దూరంగా ఉంటున్నారు. ఇటీవల వారిద్దరు మళ్లీ కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో ఉన్న కుటుంబ కలహాలతో శనివారం రాత్రి భార్య సబీనా విశాల్ పై కత్తితో దాడి చేసి చంపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo