దారుణం : భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య...

అమరావతి : కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తపై, భార్య పెట్రోల్ పోసి తగల బెట్టింది. ఇనకుదురు పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటి చైర్మన్ షేక్ అచ్చాబా కుమారుడు ఎస్.కే. ఖాదర్ బాషాపై పెద్ద భార్య గురువారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించింది. 50 శాతం కాలిన గాయాలతో ఉన్న ఖాదర్ భాషా ను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రయివేటు ఆస్పత్రి కి తరలించారు. అయితే అయన ఆరోగ్యం విషమంగా ఉన్నది.
ఖాదర్ భాషాకు ఇద్దరు భార్యలు. భార్యలిద్దరూ అక్క చెల్లెళ్లు. మొదట అక్కను పెళ్లి చేసుకోగా..... రెండు నెలల క్రితం ఆమె చెల్లెల్ని బాషా రెండో పెళ్లి చేసుకున్నాడు. తన దగ్గరకంటే తన చెల్లెలి వద్దే ఎక్కువ కాలం బాషా గడుపుతూ ఉండటంతో మొదటి భార్య, భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండేది. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటి భార్య బాషాపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
- ఆ బుల్లెట్ ఎవరిదో తెలిసిపోయింది..!
- సీబీఐ, ఈడీ స్వతంత్రంగా లేకుంటే ప్రజాస్వామ్యానికే తీరని ముప్పు!
- యజమాని కోసం ఆసుపత్రి వద్ద కుక్క నిరీక్షణ
- ఈ రంగాల్లో కొలువుల కోతకు బ్రేక్!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- 24న తెలంగాణ తాసిల్దార్ల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
- టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు