Crime
- Sep 22, 2020 , 15:12:59
ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య

వరంగల్ రూరల్ : జిల్లాలోని నెక్కొండ మండలంలోని గేటుపల్లికి చెందిన బాదావత్ దుర్యత్ సింగ్ (40) అదృశ్యంపై మిస్టరీ వీడింది. దుర్యత్ సింగ్ వరంగల్ ట్రాఫిక్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య జ్యోతి నెక్కొండలో గత కొద్ది నెలల నుంచి టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నది. ఈక్రమంలో ఇదే మండలంలోని అప్పల్ రావుపేట గ్రామానికి చెందిన జిల్లా రాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారీతీసింది.
ఈ విషయం భర్త దుర్యత్ సింగ్ కు తెలిసింది. దీంతో ఎలాగైన భర్తను అడ్డు తొలగించాలని ప్రియుడు రాజు, భార్య జ్యోతి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుడు ఈనెల 15 తేదీ నుంచి కనపడటం లేదు. ప్రస్తుతం స్థానిక పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతున్నది.
తాజావార్తలు
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
- ఆ బుల్లెట్ ఎవరిదో తెలిసిపోయింది..!
- సీబీఐ, ఈడీ స్వతంత్రంగా లేకుంటే ప్రజాస్వామ్యానికే తీరని ముప్పు!
- యజమాని కోసం ఆసుపత్రి వద్ద కుక్క నిరీక్షణ
- ఈ రంగాల్లో కొలువుల కోతకు బ్రేక్!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- 24న తెలంగాణ తాసిల్దార్ల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
- టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు
MOST READ
TRENDING