బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 22, 2020 , 21:56:24

లోయలోకి దూసుకెళ్లిన వ్యాన్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

లోయలోకి దూసుకెళ్లిన వ్యాన్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

నాగర్‌ కర్నూల్‌ : తృటిలో పెను ప్రమాదం తప్పింది. దైవ దర్శనానికి వెళ్తుండగా అదుపు తప్పి వ్యాన్‌లోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆమ్రాబాద్‌ ఈగలపెంట హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వ్యాన్‌ వెళ్తుండగా ఘాట్‌రోడ్డుపై ప్రమాదవశాత్తు అదుపు తప్పి 50 అడుగుల లోయలో పడింది. ప్రమాద సమయంలో అందులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్‌ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రక్షించారు. ఇందులో నలుగురు తీవ్ర గాయాలకు కాగా, ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరికి చికిత్స కోసం దవాఖానాకు తరలించారు. బాధితులంతా హైదరాబాద్‌కు చెందిన దూల్‌పేటకు చెందిన వారిగా గుర్తించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo