సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jun 18, 2020 , 12:50:02

బైక్ ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం..ఒకరు మృతి

బైక్ ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం..ఒకరు మృతి

సంగారెడ్డి : జహీరాబాద్ పట్టణ ‌‌సమీపంలోని హోతి(కే) శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విఠల్ రెడ్డి (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై ఉన్న దశరథ్, బబ్లూ కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు ఝరాసంగం మండలం బోపాన్ పల్లి గ్రామ నివాసిగా గుర్తించారు. ముగ్గురు ఒకే బైక్ పై ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగింది. జహీరాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


logo