బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 24, 2020 , 14:23:35

ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌ మృతి

ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌ మృతి

వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నల్లబెల్లి మండల కేంద్రంలో  ఇటుక బట్టీల వద్ద మట్టిని దమ్ము చేస్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమదంలో లెంకాలపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్ జిట్టబోయిన నాగరాజు  (25) ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు‌ చేసి  దర్యాప్తు జరుపుతున్నారు. నాగరాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


logo