సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 13:32:05

వ్యాపారిని కాల్చి.. రూ.లక్ష డబ్బు కాజేసిన దుండగులు

వ్యాపారిని కాల్చి.. రూ.లక్ష డబ్బు కాజేసిన దుండగులు

సాంభల్‌ : ఓ వ్యాపారిని కాల్చి ఆయన చేతిలో ఉన్న రూ.లక్ష డబ్బున్న బ్యాగును దుండగులు లాక్కెళ్లిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ర్టం సాంభల్‌ జిల్లా కోకాభాశ్‌ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కోకాబాశ్‌ గ్రామానికి చెందిన అవతార్‌శర్మ (60), అతడి కుమారుడు విశాల్‌ గురువారం రాత్రి  తమ దుకాణాన్ని మూసివేసి రూ.లక్ష డబ్బు ఉన్న బ్యాగుతో ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నారు. 

ఇదే సమయంలో మరో ద్విచక్రవాహనంపై ఇద్దరు దుండగులు వేగంగా వచ్చి అవతార్‌ శర్మ చేతిలోని బ్యాగును లాగడానికి ప్రయత్నించారు. కానీ తండ్రీకొడుకులు ప్రతిఘటించడంతో దుండగులు వారిపై కాల్పులు జరిపి డబ్బు లాక్కొని పారిపోయారు. ఈ కాల్పల్లో అవతార్‌శర్మ మెడ భాగంలో బుల్లెట్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందగా విశాల్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి, నిందితులను వెతుకుతున్నామని ఎస్పీ యమునా ప్రసాద్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo