మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 16:40:20

దారి దోపిడీలో వ్యక్తిని పొడిచి చంపిన దుండగులు

దారి దోపిడీలో వ్యక్తిని పొడిచి చంపిన దుండగులు

న్యూ ఢిల్లీ :  పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్‌లో మంగళవారం రాత్రి దారి దోపిడీలో భాగంగా దొంగలు ఇద్దరిపై కత్తులతో దాడి చేయగా ఒకరు మృతి చెందారు. రంజన్ (25), ధీరజ్ (26) అనే ఇద్దరు ఉద్యోగులు మంగళవారం రాత్రి కార్యాలయంలో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా సరిగ్గా 24 బ్లాక్ పార్క్ తిలక్‌నగర్‌ సమీపంలోకి రాగానే ముగ్గురు దొంగలు బైక్‌ మీద వచ్చి వారిని ఆపారు. రావడంతోనే ఇరువురిని డబ్బు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. వారు ప్రతిఘటించడంతో దుండగులు కత్తితో దాడి చేయగా రంజన్‌, ధీరజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రంజన్‌కు కుడి తొడపై తీవ్ర గాయం కాగా దవాఖానకు తరలించే లోగా చనిపోయాడు. ధీరజ్‌కు ఎడమ తొడపై కత్తిపోటు పడడంతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ ఘటనపై రాత్రి 11:29 గంటలకు పోలీసులకు సమాచారం అందగా వారు ఘటనా స్థలానికి చేరుకొని ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉద్యోగుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, మొబైల్, కొంత డబ్బును దోచుకున్నట్లు తేలింది. తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ సమీర్ శర్మ అన్నారు. ఇదిలా ఉండగా జూన్‌ 30 వరకు ఢిల్లీలో మొత్తం 785 దోపిడీ కేసులు నమోదయ్యాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo