ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 01, 2020 , 15:10:08

స్నేహితుడికి ఎక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య

స్నేహితుడికి ఎక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య

ఉత్తర్‌ప్రదేశ్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన స్నేహితుడికి తనకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని ఓ  పదో తరగతి విద్యార్థిని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కాన్పూర్‌లోని కల్యాణ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాలు.. కల్యాణ్‌పూర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ నిషాద్‌ కుమార్తె అమీషా(15) స్థానికంగా ఓ పాఠశాలలో పదోతరగతి చదువుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. అందులో తనకు 83శాతం మార్కులు రాగా తన స్నేహితుడికి 85శాతం మార్కులు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన అమీషా మంగళవారం తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ ఘటనకు సంబంధించి తండ్రి శ్రావణ్‌కుమార్‌ నిషాద్‌ మాట్లాడుతూ పరీక్ష ఫలితాలు వచ్చినప్పటి నుంచి తన స్నేహితుడి కంటే తనకు తక్కువ పర్సంటేజి వచ్చిందని, తాను అనుకున్న విధంగా మార్కులు రాలేదని అమీషా డిప్రెషన్‌లో ఉండేదని తెలిపాడు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలియజేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo