ఆదివారం 24 జనవరి 2021
Crime - Oct 13, 2020 , 16:47:40

రైతుబీమా డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

రైతుబీమా డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

సంగారెడ్డి : రైతుబీమా డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. నవ మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. రూ. 5 లక్షల రైతుబీమా డబ్బుల కోసం సొంత తల్లినే హతమార్చిన ఘటన ఏడాది తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని కంగరి మండలం బాబులాగమ శివారులో ఏడాది క్రితం తులసీ బాయ్ హత్యకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కొడుకు పవార్ శంకర్, మనుమడు పుండలిక్‌తో కలిసి హత్య చేసినట్లు తేలింది. కేవలం రైతుబీమా డబ్బుల కోసం హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo