మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 22, 2020 , 12:07:42

పేకాట స్థావరం గుట్టురట్టు

పేకాట స్థావరం గుట్టురట్టు

వికారాబాద్ : జిల్లాలోని బషీరాబాద్ మండలంలోని దామర్ చెడ్ గ్రామంలో చక్రపాణి, కృష్ణమూర్తి అనే వ్యక్తులు గుట్టుగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు చేపట్టారు. 20 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. మరో 40 మంది పరారైనట్లు సమాచారం. పట్టుబడిన వారి నుంచి రూ.1లక్ష 76 వేల 680, 17 సెల్ ఫోన్లు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు.


logo