శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 17:42:46

తమ్ముడిని హత్య చేసిన అన్న..కామారెడ్డి జిల్లాలో విషాదం

తమ్ముడిని హత్య చేసిన అన్న..కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి : పొలం గట్ల పంచాయతీలో  భాగంగా తమ్ముడిని అన్న పారతో కొట్టి చంపిన  విషాద ఘటన జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రంలో  చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మామిడి దేవరాజు (38), మామిడి కిషన్ లకు మధ్య గత కొంత కాలం నుంచి పొలం గట్ల వివాదం నడుస్తున్నది. ఈ రోజు దేవరాజు గట్లు చెక్కుతుండగా వెనుక నుంచి అన్న కిషన్ పారతో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో అక్కడిక్కడే దేవరాజు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
logo