ఆదివారం 24 జనవరి 2021
Crime - Jan 01, 2021 , 20:05:50

కొత్త సంవత్సరం ఆ కుటుంబానికి కలిసి రావడం లేదు

కొత్త సంవత్సరం ఆ కుటుంబానికి కలిసి రావడం లేదు

యాదాద్రి భువనగిరి : ఆ కుటుంబానికి కొత్త సంవత్సరం కలిసి రావడం లేదు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఇదే నూతన సంవత్సరం రోజున భర్త అనారోగ్యంతో మృతి చెందగా నేడు భార్య గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన భువనగిరి పట్టణంలోని హనుమాన్ వాడలో చోటుచేసుకుంది. చల్ల జహంగీర్ 11 సంవత్సరాల క్రితం చనిపోగా లక్ష్మి తన నలుగురు కూతుళ్లు ఒక కొడుకును కూలిపని చేసుకుంటూ పోషిస్తోంది. గత నెల రోజుల క్రితమే పెద్ద కూతురు వివాహం చేసింది. పెండ్లికి కాస్త అప్పుల అవడం మిగతా పిల్లల చదువు గురించి ఆలోచిస్తూ తీవ్ర ఆవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వారి పిల్లలు అనాథలుగా మారిపోయారు.


logo