శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jun 15, 2020 , 08:10:29

సూర్యాపేటలో దారుణం.. దారుణం..చిన్నారులను చెరువులోకి తోసేసిన తల్లి

సూర్యాపేటలో దారుణం.. దారుణం..చిన్నారులను చెరువులోకి తోసేసిన తల్లి

సూర్యాపేటలో : భార్యభర్తల మధ్య ఇద్దరు చిన్నారులు బలి అయిన దారుణ సంఘటన చోటు చేసుకొంది. సూర్యాపేటలోని విద్యానగర్‌లో నివాసముంటున్న ప్రశాంత్‌కుమార్‌, నాగమణి ఆదివారం రాత్రి గొడవ పడ్డారు.

దీంతో ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వెళ్లిన భార్య నాగమణి సమీపంలోని సద్దల చెరువులో కొడుకు హర్షవర్ధన్‌, కుమార్తె జ్యోతిమాధవిని పడేసింది. సోమవారం ఉదయం చెరువు వద్ద నాగమణిని గమనించిన స్థానికులు విషయాన్ని ఆరా తీయగా ఇద్దరు బిడ్డలను చెరువులో పడేసిట్లు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చెరువులో కుమారుడు హర్షవర్ధన్‌ మృతదేహం లభ్యం కాగా జ్యోతిమాధవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ సంఘటన చేరుకుని మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. logo