మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 26, 2020 , 13:15:51

గ్యాస్ ‌సిలిండర్‌తో కొట్టి కన్నకొడుకును హత్య చేసిన తల్లి...

గ్యాస్ ‌సిలిండర్‌తో కొట్టి కన్నకొడుకును హత్య చేసిన తల్లి...

అమరావతి : విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. చెడువ్యసనాలకు బానిసైన కన్నకొడుకును ఓ తల్లి హత్య చేసింది. మధురవాడలోని మారికవలస న్యూకాలనీలో నివాసం ఉంటున్న కోట్ల శ్రీను, మాధవి దంపతులకు అనిల్‌(18)తో పాటు కుమార్తె ఉన్నారు. గత కొంతకాలం నుంచి అనిల్‌ చెడు వ్యసనాలకు బానిసై డబ్బులివ్వమని తల్లిదండ్రులను రోజూ వేధిస్తున్నాడు. ప్రతీరోజూ బయట వ్యక్తులతో గొడవపడటంతోపాటు తల్లిదండ్రులపైనా భౌతికదాడులకు దిగుతున్నాడు. దీంతో విసిగిపోయి ఆదివారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్నసమయంలో అనిల్‌ ఛాతీపై తల్లి మాధవి గ్యాస్‌సిలిండర్‌తో కొట్టి హత్య చేసింది. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.