మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 17, 2020 , 21:59:15

వేధింపులు భరించలేక కొడుకును హతమార్చిన తల్లి

వేధింపులు భరించలేక కొడుకును హతమార్చిన తల్లి

కృష్ణా : వేధింపులు భరించలేక విసిగిపోయిన తల్లి కన్న కొడుకుని హతమార్చిన సంఘటన కృష్ణా జిల్లా బాపులపాడులోని బొమ్ములూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన కొల్లి బాబి (29) గత కొంతకాలంగా డబ్బు కోసం తల్లిని వేధిస్తుండడంతో తల్లి విసుగు చెందింది.

రోజురోజుకు కొడుకు వేధింపులు ఎక్కువ అవడంతో  భరించలేక నిద్రమత్తులో ఉన్న బాబిని రాయితో మోది హతమార్చింది. ఆపై పోలీసులకు లొంగిపోయింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo