గురువారం 28 జనవరి 2021
Crime - Jan 12, 2021 , 20:08:26

బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

మెదక్‌ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సాపూర్ మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన నర్సింలు మరో వ్యక్తితో కలిసి చిన్నచింతకుంట గ్రామంలో కల్లు తాగి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి పడటంతో నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


logo