శుక్రవారం 22 జనవరి 2021
Crime - Oct 06, 2020 , 12:44:49

విద్యుత్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్..

విద్యుత్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్..

రంగారెడ్డి : ఉద్యోగంలోంచి తొలగించిన తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ ఘటన జిల్లాలోని మొయినాబాద్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ లో చోటు చేసుకుంది. కాట్రాక్టు బేస్ కింద విధులు నిర్వహించిన కృష్ణ అనే వ్యక్తి సబ్ స్టేషన్ లోని విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసువడానికి ప్రయత్నించాడు. 

నన్ను విధుల నుంచి తొలగించడానికి ఏఈ శివశంకర్, లైన్ ఇన్ స్పెక్టర్ లు గోపాల్, రవి కారణమని ఆరోపించాడు. వారు చేసిన తప్పులకు నన్ను బాధ్యున్ని చేసి విధుల నుంచి తొలగించేలా చేశారు. విధుల్లోకి మళ్లీ తీసుకుంటామని చెప్పి ఆరు నెలల నుంచి ఏడీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. విధుల్లోకి తీసుకోవడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.logo