మాడ్రిడ్: 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు ఈ నెల 28న ప్రారంభం కానున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని రఫా గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. గతవారం ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో జొకోవిచ్ చేతిలో ఓడిన నాదల్.. విశ్రాంతి కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. బీజింగ్ ఒలింపిక్స్ (2008)లో స్వర్ణం సాధించిన రఫా.. 2008, 2010లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచాడు.