సోమవారం 25 జనవరి 2021
Crime - Nov 16, 2020 , 13:06:56

ట్రాక్టర్‌ బోల్తా పడి వ్యక్తి మృతి

ట్రాక్టర్‌ బోల్తా పడి వ్యక్తి మృతి

వరంగల్ రూరల్ : జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి, కొడుకు వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాకర్ అదుపు తప్పి బోల్తా పడట‌ంతో తండ్రి వీరన్న (49) మృతి చెందిన సంఘటన వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామ శివారులో జరిగింది. పడుగు పనులు కోసం సొంత ట్రాక్టర్‌తో తండ్రి, కొడుకు వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పూడిక బొంద బావిలో బోల్తా పడింది. ట్రాక్టర్ ఇంజన్ కింద పడి బానోత్ వీరన్న చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుoడగా కుమారుడు బానోత్ మదన్ లాల్  జేసీబీ తెప్పించి ట్రాక్టర్ ఇంజన్ కింది నుంచి వీరన్నను తీసే ప్రయత్నం చేశాడు. అప్పటికే వీరన్న మృతి చెందాడు. మృతుడి భార్య భద్రమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


logo