బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 08, 2020 , 18:11:52

చెరువులో పడి వ్యక్తి మృతి

 చెరువులో పడి వ్యక్తి మృతి

మేడ్చల్ ‌- మాల్కిజిగిరి ‌: స్నేహితుడితో కలిసి చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హకీంపేట చెరువ వద్ద చోటు చేసుకుంది. సీఐ భిక్షపతి రావు తెలిపిన వివరాల ప్రకారం.. రసూల్‌పుర ఇందిరమ్మ నగర్‌కు చెందిన చంద్రకాంత్‌(33) మంగళవారం ఉదయం స్నేహితుడు చందులాల్‌తో కలిసి హకీంపేటలోని చెరువు వద్దకు వచ్చారు. 

ఈ క్రమంలో చందులాల్‌, చంద్రకాంత్‌లు చెరువు గట్టుపై నుంచి చేపలు పడుతున్న క్రమంలో చంద్రకాంత్‌ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. చంద్రకాంత్‌ను రక్షించేదుకు స్నేహితుడు  చందులాల్‌ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చందులాల్‌ ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి గాంధీ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo