శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 12:25:43

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

షామ్లీ : భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురై వ్యక్తి పిస్టోల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం షామ్లీ జిల్లాలోని బాబ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోంటా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోంటా గ్రామానికి చెందిన బాలేందర్‌సింగ్‌(40) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. బాలేందర్‌ తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. భర్తతో విసిగి వేసారిన భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత భర్త ఎంత బతిలాడినా ఆమె ఇంటికి రావడానికి ససేమిరా అనడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలేందర్‌ సింగ్‌ శనివారం రాత్రి దేశంలో తయారు చేసిన పిస్టోల్‌తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షామ్లీలోని ప్రభుత్వ దవాఖానకు తరలించామని, మృతుడికి పిస్టోల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo