శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 17:17:58

ఈవ్‌టీజింగ్‌ వద్దన్నందుకు మహిళను చితకబాదిన వ్యక్తి!.. వీడియో

ఈవ్‌టీజింగ్‌ వద్దన్నందుకు మహిళను చితకబాదిన వ్యక్తి!.. వీడియో

ఘజియాబాద్ : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ వృద్ధ మహిళను గుర్తు తెలియని దుండగుడు దారుణంగా కొట్టాడు. ఈవ్ టీజింగ్ ప్రయత్నాన్ని మహిళ ప్రతిఘటించడంతోనే యువకుడు ఆమెను వెంబడించి మరీ చితకబాదినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 12న కావినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజపూర్ గ్రామంలో చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.  

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఘజియాబాద్‌ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. అయితే మహిళ పిర్యాదులో ఈవ్‌టీజింగ్‌ విషయాన్ని ప్రస్తావించలేదని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళ దవాఖానలో చికిత్స పొందుతుందని ఆమె నుంచి వివరాలు సేకరించిన తరువాత అసలు విషయం తెలుస్తుందని తెలిపారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo