బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 08, 2020 , 13:32:33

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ

లక్నో : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో 5గురు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలోని సికంద్ర పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని గురుద్వార సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. కాన్పూర్ నుంచి  కంటైనర్‌తో వస్తున్న లారీ అదుపుతప్పి ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో 5గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్, క్లీన‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్షమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo