సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 15:54:45

ఐలవ్ యూ అన్న జడ్జి.. ఫిర్యాదు చేసిన మహిళా ఎస్ఐ

ఐలవ్ యూ అన్న జడ్జి.. ఫిర్యాదు చేసిన మహిళా ఎస్ఐ

అహ్మదాబాద్ : అర్ధరాత్రి వేళ తనకు ఐలవ్ యూ అంటూ మెసేజ్ పంపారంటూ ఓ మహిళా ఎస్ఐ పోలీసులకు ఫిర్యదు చేసింది. తనకేం తెలియదు, తన ఇంటి పనిమనిషి అలా మెసేజ్ పంపివుండొచ్చు మొర్రో అంటూ ఆ జడ్జి నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో జరిగింది.

పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు, అమ్రేలి జిల్లాలోని రాజుల పట్టణానికి చెందిన అదనపు న్యాయమూర్తి ఒకరు స్థానిక మహిళా పోలీసు అధికారికి మొబైల్‌లో ఐ లవ్ యు అంటూ సందేశాన్ని పంపారు. ఆగస్టు 30 తెల్లవారుజామున సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి తన మొబైల్‌ నుంచి.. గుడ్ మార్నింగ్, మిస్ యు డియర్, లవ్ యూ టూ అంటూ సందేశాలను మహిళ ఎస్ఐకి పంపారు. తన ఫోన్కు వచ్చిన మెసేజ్ లను ఉదయాన్నే చూసుకున్న మహళా ఎస్ఐకి మతిపోయినంత పనైంది. గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి ఐలవ్ యూ అంటూ మెసేజ్లు రావడమేంటని కంగారుపడిపోయి.. వెంటనే ఆ నంబర్ కు ఫోన్ చేసింది. ఎవరు మాట్లాడుతున్నారు అని అడగ్గా.. తాను సెషన్ కోర్టు అదనపు న్యాయమూర్తిని అని సమాధానం వచ్చింది. అదిసరే సార్, అర్ధరాత్రి వేళ ఐలవ్ యూ అంటూ సందేశాలు పంపడమేంటని నిలదీసింది. తానేం అలాంటి సందేశాలను పంపలేదని, తన ఇంటి పనిమనిషి పని అయి వుంటుందని చెప్పినా మహిళా ఎస్ఐ వినిపించుకోలేదు. మీ ఫోన్ నుంచి పనిమనిషి ఎలా సందేశాలు పంపుతారు అంటూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని ఆ మహిళా ఎస్ఐ అధికారులను కోరారు.

తాజావార్తలు


logo