శుక్రవారం 15 జనవరి 2021
Crime - Dec 13, 2020 , 12:12:06

భార్యను హత్య చేసిన భర్త

భార్యను హత్య చేసిన భర్త

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే ఇల్లాలిని కడతేర్చాడు. పోలీసుల కథనం మేరకు..టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ హనుమ తండాకు చెందిన మంగ (38) అనే మహిళ ఈ నెల 2వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆమె తమ్ముడు ఈశ్వర్ టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులు మంగ భర్త గూగులోత్ భాస్కర్‌ను పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్టుగా  ఒప్పుకున్నాడు. హత్య చేసి శాంతి నగర్ ఓసీ ప్రాంతంలో పడేసినట్లు నేరం అంగీకరించాడని పోలుసులు తెలిపారు. పోలీసులు లోయలో పడేసిన కుళ్లిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.