గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 25, 2020 , 11:24:42

భార్యను కొట్టి చంపిన భర్త

భార్యను కొట్టి చంపిన భర్త

బండా : రాను రాను బంధాలకు విలువ లేకుండా పోతోంది. మానవ సంబంధాలు మంట గలిసిపోతున్నాయి. క్షణికావేశంతో చేసే నేరాలు జీవిత కాల శిక్షకు దారితీస్తున్నాయి. ఫలితంగా అభం శుభం తెలియని చిన్నారులు దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడుతున్నారు. మొన్నటికి మొన్న అత్త, భార్య కలిసి భర్తను చంపగా.. తాజాగా కుటుంబ కలహాల మధ్య భార్యను భర్త కొట్టి చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ర్టం బండా జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాలు.. బండా జిల్లాలోని మర్దానకకు చెందిన ఓ వ్యక్తి స్థానికంగా కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవాడు. అతను తన భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. శుక్రవారం సాయంత్రం మద్యం సేవించి వచ్చిన భర్త, భార్య జహేదా(35)తో గొడవకు దిగాడు. ఘర్షణ తీవ్రం కావడంతో కోపోద్రిక్తుడైన భర్త దుడ్డు కర్రతో భార్య తలపై విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన జాహేదా అక్కడికక్కడే మృతిచెందినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దినేశ్‌ సింగ్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించామని పోలీసులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo