గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 25, 2020 , 18:34:43

రూ.20వేల కోసం నాయనమ్మను చంపిన మనువడు

రూ.20వేల కోసం నాయనమ్మను చంపిన మనువడు

బండి : రాజస్థాన్‌లోని బండి జిల్లాలో రూ.20 వేల కోసం మనువడు తన నాయనమ్మను కొట్టగా తీవ్రగాయాల పాలైన వృద్ధురాలు దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బండి జిల్లా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలోని ఉమరుతన గ్రామానికి చెందిన జుమ్రిబాయి మీనా (80) తన మనువడు దీపక్‌కు వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఇటీవల రూ.20వేలు ఇచ్చింది. ఆదివారం తన డబ్బు తిరిగివ్వాలని మనువడిని అడగ్గా తీవ్ర కోపోద్రిక్తుడైన దీపక్‌ దుడ్డు కర్రతో నాయనమ్మ తలపై విచక్షణా రహితంగా కొట్టి పారిపోయాడు. 

తీవ్రంగా గాయపడిన జుమ్రిబాయిను కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానలో చేర్చగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సదర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ షౌకత్ ఖాన్ మంగళవారం తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo