శుక్రవారం 15 జనవరి 2021
Crime - Sep 28, 2020 , 17:24:15

నీటి గుంటలో పడి బాలిక మృతి

నీటి గుంటలో పడి బాలిక మృతి

ఖమ్మం : జిల్లాలోని చింతకాని మండలం సీతంపేట గ్రామంలో నీటి గుంటలో పడి బాలిక మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సీతంపేటకి చెందిన బిందు (9) అనే బాలిక తన చెల్లెలుతో కలిసి తాతయ్య వాళ్ల ఇంటి వద్ద ఉంటున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లడంతో వారు తాతయ్య, అమ్మమ్మతో కలిసి గ్రామ సమీపంలోని పొలంలో గడ్డి కోసం వెళ్లారు. తాతయ్య, అమ్మమ్మ వాళ్లు గడ్డి కోస్తుండగా.. అక్కాచెల్లెళ్లు చుట్టుపక్కల తిరుగుతూ ప్రమాదవశాత్తు సమీపంలోని నీటి గుంటలో పడి పోయారు. గమనించిన వారి తాతయ్య,  స్థానికులు చిన్న పాపను కాపాడారు. పెద్ద పాప మృతి చెందింది. చిన్నారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు.