బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 01, 2020 , 16:57:23

హత్రాస్ యువతిపై లైంగికదాడి జరుగలేదు: ఏడీజీపీ

హత్రాస్ యువతిపై లైంగికదాడి జరుగలేదు: ఏడీజీపీ

లక్నో: హత్రాస్‌కు చెందిన 19 ఏండ్ల యువతిపై సామూహిక లైంగిక దాడి జరుగలేదని, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు దీనిని స్పష్టం చేస్తున్నాయని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. గొంతుపై గాయం వల్ల ఆమె చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కొందరు దురుద్దేశంతో ఈ ఘటనకు కులాన్ని ఆపాదించి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు చేపడతామని ఏజీడీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.

మరోవైపు అలీఘఢ్ ఆసుపత్రి ఇచ్చిన నివేదికలో కూడా గాయలతో ఆమె చనిపోయినట్లు ఉన్నదని హత్రాస్ ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. ఆ యువతిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించలేదని ఆయన చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని కూడా సిట్ టీం పరిశీలించిందని, దర్యాప్తు కోసం ఆ గ్రామంలోనే ఉన్నదని ఎస్పీ విక్రాంత్ వీర్ వెల్లడించారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo