మంగళవారం 20 అక్టోబర్ 2020
Crime - Sep 27, 2020 , 19:37:38

బస్సులో యువతిని నిర్బంధించి అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్

బస్సులో యువతిని నిర్బంధించి అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో నిర్భయ లాంటి ఘటన మరొకటి చోటుచేసుకున్నది. కదులుతున్న బస్సులో ఓ యువతిని నిర్బంధించి అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను బస్సులో నుంచి తోసేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ బైసాలి బస్టాండ్ లో బాధితురాలు బస్సు ఎక్కింది. బస్సు సిబ్బంది ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన యువతిపై బస్సు డ్రైవర్, కండెక్టర్ లు ఆత్యాచారం చేసినట్టు యువతి పేర్కొన్నది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo