శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 20, 2020 , 08:21:23

యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్య‌వ‌హార‌మే కారణం!

యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్య‌వ‌హార‌మే కారణం!

క‌రీంన‌గ‌ర్ : జిల్లాలోని వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి నరుకుడు ప్రణయ్‌ (24) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే ప్రేమికురాలి కుటుంబీకులు హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ప్ర‌ణ‌య్‌ తల్లిదండ్రులు మొగిలి, పద్మ కూలీలు. కాగా ప్రణయ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌.. అదే గ్రామం, సామాజిక వర్గానికి చెందిన ఓ యువతిని గ‌త 8 సంవ‌త్స‌రాల నుంచి ప్రేమించుకుంటున్నారు.  

ఈ క్రమంలో సోమవారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ప్రణయ్‌.. త‌న ప్రియురాలి ఇంటికెళ్లాడు. ప్ర‌ణ‌య్ వ‌చ్చిన విష‌యం ప్రియురాలి సోద‌రుడికి తెలియ‌డంతో ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోయాడు. త‌న సోద‌రితో స‌న్నిహితంగా ఉన్న ప్ర‌ణ‌య్‌పై అత‌ను దాడి చేశాడు. ఇనుప రాడ్‌తో దాడి చేయ‌డంతో అక్క‌డిక‌క్క‌డే ప్ర‌ణ‌య్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ త‌ర్వాత ప్ర‌ణ‌య్ మృత‌దేహాన్ని శివార్ల‌లోని ముళ్ల పొద‌ల్లో ప‌డేశారు. స్థానికులు అందించిన స‌మాచారంతో పోలీసులు పోతిరెడ్డిప‌ల్లి గ్రామానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

ప్రియురాలి ఇంట్లో ర‌క్త‌పు మ‌ర‌క‌లు

త‌మ కుమారుడిని ప్రియురాలి కుటుంబ స‌భ్యులే హ‌త్య చేశార‌ని ప్ర‌ణ‌య్ త‌ల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఆమె ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఇంట్లో ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ప్రియురాలి సోద‌రుడే ఈ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. హ‌త్య జ‌రిగిన ప్రాంతంలో పోలీసులు ఆధారాలు సేక‌రించారు. 

జ‌మ్మికుంట రూరల్‌, టౌన్‌ సీఐలు రాములు, సృజన్‌రెడ్డి, వీణవంక ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.