శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 22:06:52

మ‌ద్యం మ‌త్తులో ప్రియురాలిని చంపి.. పొలంలో పాతిపెట్టి..

మ‌ద్యం మ‌త్తులో ప్రియురాలిని చంపి.. పొలంలో పాతిపెట్టి..

సోనిప‌ట్ : హర్యానాలోని నోసిప‌ట్‌లో సంచ‌ల‌న కేసు వెలుగులోకి వ‌చ్చింది. తాగిన మైకంలో ఓ యువ‌కుడు త‌న ప్రియురాలిని చంపి మృత‌దేహాన్ని పొలంలో పాతిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివ‌రాలు.. బేగుసారైకు చెందిన శ్ర‌వ‌ణ్‌, స‌విత అనే వివాహిత‌తో స్నేహం చేశాడు. అది కాస్తా వివాహేత‌ర సంబంధానికి దారి తీయ‌డంతో నాలుగు నెల‌లుగా వీరిద్ద‌రు క‌లిసి నివ‌సిస్తున్నారు. 

ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం శ్ర‌వ‌ణ్ ఫూటుగా మ‌ద్యం సేవించి త‌న వ‌ద్ద‌కు రావ‌డంతో.. ఎందుకు తాగావ‌ని స‌విత వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్ర ఆగ్ర‌హం చెందిన శ్ర‌వ‌ణ్.. క‌త్తితో ఆమె గొంతు కోసి హ‌త్య చేశాడు. త‌రువాత త‌న మిత్ర‌డు బ్రిజేశ్ సాయంతో బైక్‌పై మృత‌దేహాన్ని త‌ర‌లించి గర్హ్ షాజన్‌పూర్ గ్రామంలోని శ్మశానవాటిక ఘాట్ సమీపంలో గ‌ల పొలాల్లో పాతిపెట్టాడు. సాయంత్రం కావ‌డంతో సవిత కుమార్తె ఏడుపు ప్రారంభించింది. ఎంత‌కూ ఆప‌క‌పోవ‌డంతో అనుమానంతో ఇంటి య‌జ‌మాని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచార‌ణ ప్రారంభించ‌గా.. శ్ర‌వ‌ణ్ మ‌రో వ్య‌క్తితో క‌లిసి స‌విత‌ను బైక్‌పై తీసుకెళ్తుండ‌గా చూసిన‌ట్లు ఓ స్థానికుడు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. 

ఇద్ద‌రినీ అదుపులోకి తీసుకొని విచార‌ణ చేయ‌గా నేరం ఒప్పుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఆ త‌రువాత మ‌హిళ మృత‌దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించామ‌ని వారు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo