మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 24, 2020 , 16:09:44

ప్రియురాలిని అతికిరాతకంగా చంపేసిన ప్రియుడు

 ప్రియురాలిని అతికిరాతకంగా చంపేసిన ప్రియుడు

అమరావతి : కడపజిల్లాలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలితో నమ్మకంగా ఉంటూనే కిరాతకంగా చంపేశాడు. అర్ధరాత్రి సమయంలో అతి దారుణంగా చంపేసి తప్పించుకు తిరుగుతున్న ప్రియుడిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కలపుది గ్రామానికి చెందిన సుజాత, సమీపంలోని గిద్దలూరుకి చెందిన ప్రసాద్‌ కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల కడప జిల్లాలోని చిట్వేలి మండలం దేవమాచుపల్లెకి మకాం మార్చారు. గ్రామానికి చెందిన ఓ రైతు మామిడితోటకి కాపలాగా ఉంటూ అక్కడే నివాసముంటున్నారు.

ఈ నెల 18న అర్ధరాత్రి వేళ అనూహ్యంగా ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసి ప్రియుడు ప్రసాద్ పారిపోయాడు. అమానుషంగా చంపి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ప్రసాద్‌పై నిఘా పెట్టిన పోలీసులు చిట్వేలి బస్టాప్ వద్ద వేచి ఉండగా అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.