సోమవారం 18 జనవరి 2021
Crime - Dec 12, 2020 , 19:03:32

చెరువులో పడి బాలుడు మృతి

చెరువులో పడి బాలుడు మృతి

ఖమ్మం : జిల్లాలోని కారేపల్లి మండలంలో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మండ‌ల‌ కేంద్రానికి చెందిన చైతన్య (8) అనే బాలుడు శనివారం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. బాలుడి తాతయ్య పొలానికి పశువులను తోలుకుని వెళ్ల‌గా వెంట వెళ్ళాడు. పొలం సమీపంలో చెరువు ఉండగా బాలుడు చెరువులో కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. సమీపంలో ఉన్న తాత వచ్చేటప్పటికి నీటిలో మునిగి చనిపోయినట్లుగా స‌మాచారం.