ఆదివారం 17 జనవరి 2021
Crime - Sep 24, 2020 , 11:57:07

చెరువులో పడి బాలుడి మృతి

చెరువులో పడి బాలుడి మృతి

నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ కు చెందిన సిద్ధార్థ్ అనే బాలుడు బుధవారం తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న చెరువులోకి స్నానానికి వెళ్లాడు. నిన్న సాయంత్రం నుంచి సిద్ధార్థ్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగో టౌన్ పోలీసులు గాలింపు చేపట్టగా ఈరోజు ఉదయం చెరువులో సిద్ధార్థ్ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.