ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Crime - Jan 19, 2021 , 21:08:49

రోటోవేటర్‌ కిందపడి బాలుడు మృతి

రోటోవేటర్‌ కిందపడి బాలుడు మృతి

సూర్యాపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోటోవేటర్‌ కిందపడి బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌.ఎస్‌ మండలం బొప్పారం గ్రామానికి చెందిన సింగిల్‌విండో చైర్మన్‌ దేశోజు భద్రాచారికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో బంధువు రోటోవేటర్‌తో భూమి దున్నుతున్నాడు. ఈక్రమంలో భద్రాచారి కుమారుడు శివ(7)ట్రాక్టర్‌ వెనుక భాగంలో కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తు జారి రోటోవేటర్‌ మధ్యలో పడిపోయాడు. దీంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో భద్రాచారి కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. భద్రాచారి దంపతులకు సంతానం లేకపోవడంతో బంధువుల పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు కండ్లముందే చనిపోవడంతో బోరున విలపించారు.   

ఇవి కూడా చదవండి..

బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

శభాష్‌ టీమిండియా : మంత్రి హరీశ్‌ రావు 

ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు

సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి 

అత్య‌ద్భుత సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌టి: స‌చిన్‌ 

టీమిండియాకు 5 కోట్ల బోన‌స్

టీమిండియా విజ‌యంపై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు

రిష‌బ్ పంత్ సూప‌ర్ షో.. క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ 

VIDEOS

logo