సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 20:30:11

వాగులో ఈతకు వెళ్లి బాలుడి మృతి

వాగులో ఈతకు వెళ్లి బాలుడి మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోరీలపడుతాండ పంచాయతీ పరిధిలోని తుమ్మల తండా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని రాజుపేట వాగులో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురులో ప్రమాదవశాత్తు ఒకరు గల్లంతయ్యాడు. బాలుడి అరుపు విని స్థానిక రైతు, కూలీలు రక్షించేందుకు యత్నించారు. అర కిలోమీటర్ మేర కొట్టుకు పోయిన తరువాత బయటకు తీసి కూసుమంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo