ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 30, 2020 , 21:48:54

ప్రాణం తీసిన చలిమంట..

ప్రాణం తీసిన చలిమంట..

మంచిర్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భీమిని మండల కేంద్రంలోని పెద్దపేట గ్రామానికి చెందిన ఆదె రుక్ముబాయి (70) బుధవారం నిప్పంటుకొని మృతి చెందింది. భీమిని ఎస్‌ఐ కొమురయ్య కథనం ప్రకారం.. రుక్ముబాయి ఉదయం ఇంట్లో చలికి మంట కాగుతుండగా, ఆమె కప్పుకున్న బొంతకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. భర్త కొండుమే, ఆడ పడుచు పోచక్క మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. తీవ్రగాయాలైన రుక్ముబాయి అక్కడికక్కడే మృతి చెందింది. 


logo