శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 19:55:00

ప్రాణం తీసిన బారీకేడ్

ప్రాణం తీసిన బారీకేడ్

ముంబై : ముంబై గ‌రంలో విషాద‌క‌ర ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. రోడ్డు ప‌క్క‌న ఉన్న బారీకేడ్ మీద‌ప‌డి యువ‌కుడు మృతి చెంద‌గా మరొక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాలు.. క్రాంతిన‌గ‌ర్ ఖురాన్‌కు చెందిన మ‌నోజ్‌కుమార్ (27), అత‌డి స్నేహితుడు ప్ర‌శాంత్‌ ఇద్ద‌రు క‌లిసి శ‌నివారం మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు అంబేద్క‌ర్ బొరివాలి ప్రాంతానికి వెళ్లి తిరిగి వ‌స్తున్నారు.

మార్గ‌మ‌ధ్యంలో రోడ్డు ప‌నులు జ‌రుగుతున్నందున బారీకేడ్‌లు పెట్టి ఉన్నాయి. అందులో ఒక బారీకేడ్ గాలికి ఒరిగి మ‌నోజ్ బైక్‌ మీద పడ‌డంతో అదుపుత‌ప్పి ఇద్ద‌రు యువ‌కులు కింద ప‌డిపోయారు. అదే స‌మ‌యంలో వెనుక‌నుంచి వ‌స్తున్న వాహ‌నం మ‌నోజ్‌కుమార్ త‌ల‌పై నుంచి వెళ్ల‌డంతో  అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. కొంచెం వెన‌క్కి ప‌డిన ప్ర‌శాంత్ తీవ్ర గాయాల పాల‌య్యాడు. ఈ మొత్తం ఘ‌ట‌న సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఘ‌ట‌న గురించి తెలుసుకున్న పోలీసులు రోడ్డు కాంట్రాక్ట‌ర్‌తో పాటు వాహ‌న డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo