ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 16:02:05

దవాఖాన బిల్లు కట్టలేక కన్నబిడ్డను అమ్ముకున్నారు

దవాఖాన బిల్లు కట్టలేక కన్నబిడ్డను అమ్ముకున్నారు

అస్సాం : దవాఖాన బిల్లు కట్టలేక అప్పుడే పుట్టిన నవజాత శిశువును విక్రయించుకున్నారు ఓ నిరుపేద తల్లిదండ్రులు. ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ర్టం శంభునగర్‌కు చెందిన చరణ్‌, బబిత దంపతులకు ఐదుగురు పిల్లలు. 45 ఏండ్ల చరణ్‌ స్థానికంగా రిక్షా నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో బబిత మళ్లీ గర్భం దాల్చడంతో  ప్రైవేట్‌ దవాఖానలో కాన్పు చేయించగా మగ బిడ్డ పుట్టాడు. దవాఖాన బిల్లు మొత్తం రూ.35వేలు చెల్లించాల్సిందిగా నిర్వాహకులు చెప్పడంతో తన వద్ద అంత డబ్బు లేదని చరణ్‌ తెలిపాడు. 

దవాఖాన బిల్లు చెల్లించలేకపోతే బిడ్డను రూ.లక్షకు విక్రయించాల్సిందిగా సిబ్బంది కోరగా.. చేసేది లేక తమ బిడ్డను విక్రయించామని చరణ్‌, బబిత తెలిపారు. ఇదిలా ఉండగా శిశువును తాము కొనుగోలు చేయలేదని దవాఖాన సిబ్బంది చెబుతున్నారు. పేద దంపతులు తమ బిడ్డను దత్తత ఇచ్చారని ట్రాన్స్-యమునా ప్రాంతంలోని జేపీ దవాఖాన మేనేజర్ సీమా గుప్తా అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo