గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 14, 2020 , 20:25:14

కానిస్టేబుల్ క‌ళ్లు గ‌ప్పి బేడీల‌తోనే పారిపోయిన ఖైదీ..వీడియో

కానిస్టేబుల్ క‌ళ్లు గ‌ప్పి బేడీల‌తోనే పారిపోయిన ఖైదీ..వీడియో

లఖింపూర్ ఖేరి : ఓ ఖైదీకి బేడీలు వేసి జైలుకు త‌ర‌లిస్తుండ‌గా కానిస్టేబుల్ క‌ళ్లు గ‌ప్పి పారిపోయిన ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ర్టం ల‌ఖింపూర్ ఖేరిలో సోమ‌వారం చోటుచేసుకుంది. మితౌలి పోలీస్ స్టేష‌న్ ప్రాంతంలో మైన‌ర్‌పై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న‌ హిరాలాల్ అనే వ్య‌క్తికి బేడీలు వేసి సోమ‌వారం రెండు బైక్‌ల‌పై ఇద్ద‌రు కానిస్టేబుళ్లు జైలుకు త‌ర‌లిస్తున్నారు. మార్గ‌మ‌ధ్యంలో పెట్రోల్ కోస‌మ‌ని వారు బంక్ వ‌ద్ద బైకుల‌ను నిలుప‌గా.. వెనుక కూర్చున్న హిరాలాల్ అదును చూసి పారిపోయాడు. ఇద్ద‌రిలో ఓ కానిస్టేబుల్ నిందితుడి వెంట కొంత‌దూరం ప‌రిగెత్తినా లాభం లేకుండా పోయింది. 


ఈ మొత్తం సంఘటన పెట్రోల్ బంక్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. త‌రువాత పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. కానిస్టేబుళ్ల నిర్ల‌క్ష్యంపై అధికారులు విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo