బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 11:01:02

ఆ మ్యాచ్ అద్భుతం.. అందుకే ఐపీఎల్ బెస్ట్ లీగ్: గ‌ంగూలీ

ఆ మ్యాచ్ అద్భుతం.. అందుకే ఐపీఎల్ బెస్ట్ లీగ్: గ‌ంగూలీ

హైద‌రాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ లెవ‌న్ పంజాబ్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన హైస్కోర్ మ్యాచ్ అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న‌ది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఆ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ అనూహ్య విజ‌యాన్ని సాధించింది.  224 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ .. షార్జా స్టేడియంలో హోరెత్తించింది.  మ‌రో 3 బంతులు మిగిలి ఉండ‌గానే టార్గెట్‌ను చేరుకున్న‌ది.  బౌండ‌రీల వ‌ర్షం కురిసిన ఆ మ్యాచ్‌పై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్పందించారు.  ఇదో అద్భుత మ్యాచ్ అని, అందుకే ప్ర‌పంచంలో ఐపీఎల్ బెస్ట్ లీగ్ అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.  ఆట‌గాళ్లు అత్యుద్భుత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన‌ట్లు అభిప్రాయ‌ప‌డ్డారు. పంజాబ్‌, రాజ‌స్థాన్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ మొత్తం 34 ఫోర్లు, 29 సిక్స‌ర్లు బాదారు.  పంజాబ్ బ్యాట్స్‌మెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 107 ర‌న్స్ చేయ‌గా.. రాజ‌స్థాన్ జ‌ట్టులో స్మిత్‌, తెవాటియా, శాంస‌న్‌లు హాఫ్ సెంచ‌రీల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. 


logo