ఆదివారం 07 మార్చి 2021
Crime - Jan 22, 2021 , 20:18:31

ఆ బుల్లెట్‌ ఎవరిదో తెలిసిపోయింది..!

ఆ బుల్లెట్‌ ఎవరిదో తెలిసిపోయింది..!

వికారాబాద్‌ : జిల్లాలోని యాలాల మండలం అడాల్‌పూర్‌ అటవీ ప్రాంతంలో ఇటీవల పశువుల కాపరికి దొరికిన రైఫిల్‌ తూటా (బుల్లెట్)‌ రేపిన కలకలాన్ని తాండూరు పోలీసులు చేదించారు. తాండూరు పట్టణ సీఐ రవికుమార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అడాల్‌పూర్ అడవిలో దొరికిన రైఫిల్‌ బుల్లెట్‌పై విచారణ జరిపినట్లు తెలిపారు. తాండూరులో  లైసెన్స్‌ తుపాకులు కలిగి ఉన్న 54 మందిని విచారించామన్నారు. అందులో హబీబ్‌ అనే వ్యక్తి దగ్గర ఉన్న లైసెన్స్‌డు మ్యాగ్జిన్ తో పాటు తూటా కూడా లేదని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం హబీబ్‌పై నెగ్లిజెన్సీ కేసు నమోదు చేసినట్లు సీఐ వివరాలను వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం? 

కిలిమంజారోను అధిరోహించిన అన్వితా రెడ్డి

ఏసీబీ వలలో ప్రభుత్వ ఉద్యోగి

ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్‌ఎస్‌ను గెలిపిద్దాం

ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు 

VIDEOS

logo