ఆదివారం 29 నవంబర్ 2020
Crime - Oct 28, 2020 , 18:03:11

ఉర్సు ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ఇరువర్గాల ఘర్షణ

ఉర్సు ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ఇరువర్గాల ఘర్షణ

ఆదిలాబాద్‌ : జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు, గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. గ్రామానికి చెందిన షేక్‌ సిరాజ్‌, జాఫర్‌, అబ్బు, సాయిల్‌, మోబినా వర్గానికి సాజిద్‌, మజర్‌, హసన్‌, అహ్మద్‌, సాబీన్‌ మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఉర్సు ఉత్సవాల్లో దీన్ని అవకాశంగా తీసుకున్న సిరాజ్‌ వర్గం సాజిద్‌ వర్గంపై కర్రలు, గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగింది. ఈ దాడుల్లో సాజిద్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరో అయిదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక హెచ్‌ఎస్‌వో ఆకాంక్ష్‌ యాదవ్‌ (ట్రెయినీ ఐపీఎస్‌), సీఐ కంప రవీందర్‌ తెలిపారు.