మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Sep 30, 2020 , 19:44:34

న‌కిలీ పాస్‌పోర్టుపై విదేశాల్లో పనిచేసిన ప‌దేళ్ల త‌ర్వాత ప‌ట్టుబ‌డిన వైనం

న‌కిలీ పాస్‌పోర్టుపై విదేశాల్లో పనిచేసిన ప‌దేళ్ల త‌ర్వాత ప‌ట్టుబ‌డిన వైనం

హైద‌రాబాద్ : న‌కిలీ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు బహ్రెయిన్‌కు చెందిన ప్ర‌యాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. న‌గ‌రంలోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో చోటుచేసుకున్నసంఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామానికి చెందిన‌ జి. బాలు అనే వ్య‌క్తి ఆర్‌. ర‌వీంద‌ర్ పేరుతో న‌కిలీ పాస్‌పోర్టు సృష్టించి 2010లో బ‌హ్రెయిన్‌కు వెళ్లాడు. అక్క‌డే ఓ నిర్మాణ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. అదే న‌కిలీ పాస్‌పోర్టుతో మంగ‌ళ‌వారం న‌గ‌రానికి చేరుకున్నాడు. డాక్యుమెంట్‌పై ఇమ్మిగ్రేష‌న్ అధికారుల‌కు అనుమానం త‌లెత్తడంతో అత‌న్ని ప్ర‌శ్నించారు. దీంతో బాలు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇదివ‌ర‌కు సైతం బాలు ఇదే విధంగా ప్ర‌యాణించిన‌ట్లు అధికారులు గుర్తించారు. పాస్‌పోర్టును సీజ్ చేసిన అధికారులు త‌దుప‌రి విచార‌ణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. 


logo