శుక్రవారం 22 జనవరి 2021
Crime - Oct 11, 2020 , 15:34:39

ఆలయ పూజారిపై కాల్పులు.. నలుగురు అరెస్టు

ఆలయ పూజారిపై కాల్పులు.. నలుగురు అరెస్టు

గొండా : ఉత్తరప్రదేశలోని గొండా జిల్లాలో ఆలయ పూజారిపై కాల్పులకు పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గొండా జిల్లా ఇటియా థోక్‌ ప్రాంతానికి చెందిన రామ్‌జానకి ఆలయ పూజారి శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా నలుగురు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని ఎస్పీ శైలేష్‌ కుమార్‌ పాండే తెలిపారు. భూవివాదం కారణంగానే నిందితులు ఈ దుశ్చర్యకు ఒడిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనకు రంగులు పులిమే యత్నం చేయొద్దని ఆయన కోరారు. కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo