గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 15, 2020 , 16:15:14

హైద‌రాబాద్ లో టెలివిజ‌న్ ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ లో టెలివిజ‌న్ ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలో ఓ ప్ర‌యివేటు టెలివిజ‌న్ లో ప‌ని చేసే ఓ యువ‌తి(26) ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న గాంధీన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం రాత్రి చోటు చేసుకుంది. గ‌త రెండేళ్ల నుంచి ఆ యువ‌తిని.. ఆమె స‌హోద్యోగి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి ఆమెకు శారీర‌కంగా ద‌గ్గ‌రయ్యాడు. ఇప్పుడు పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చేస‌రికి.. అత‌ను ముఖం చాటేస్తున్నాడు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధితురాలు.. మంగ‌ళ‌వారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకున్న‌ది. 

మృతురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు గాంధీనగ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతురాలి ఇంట్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo